జాతీయగీతం వింటూ.. ఐష్‌ కంటతడి..!

251
Aishwarya Rai Bachchan tears
- Advertisement -

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కంటతడి పెట్టుకుంది. తాజాగా ఓ ఫంక్షన్‌లో పాల్గొన్న ఐష్ జాతీయ గీతం విన్న తర్వాత ఎమోషన్‌కి గురై కన్నీళ్ళు పెట్టుకుంది. ఐష్‌ కన్నీరు తుడుచుకోవడం వీడియోలో రికార్డ్‌ అయింది. దాంతో ఫ్యాన్స్‌ ఆమెని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. జాతీయ గీతం విని తాను ఎంత‌గా పుల‌క‌రించిపోయిందో అంటూ చర్చించుకోవ‌డం మొద‌లు పెట్టారు.

కాగా.. ఐష్‌ కి కుటుంబ స‌భ్యులు, దేశం మీద.. ప్రేమ‌, గౌరవం ఎంత ఉంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌లు సంద‌ర్భాల‌లో ఐష్ త‌న దేశ‌భ‌క్తిని ప‌లు ర‌కాలుగా ప్రూవ్ చేసుకుంది కూడా.

  Aishwarya Rai Bachchanఇక ఐష్ తో పాటు బాలీవుడ్ సెలెబ్రిటీస్ ష‌బానా అజ్మీ,సోనూ నిగ‌మ్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్ బోర్న్‌లో జాతీయ జెండాని హోస్ట్ చేసిన తొలి మ‌హిళా న‌టి ఐశ్వ‌ర్య‌ర్యాయ్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఇదిలా ఉండగా.. త‌న భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ తో క‌లిసి ఓ సినిమా చేసేందుకు కూడా ఐష్ రెడీగా ఉన్నట్టు టాక్‌. కాగా..త్వరలో తాను డైరెక్షన్ వైపు టర్న్ అవుతానని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది ఐష్.

https://www.instagram.com/p/BnWeSHeH2xr/?taken-by=instabollywood.fc

- Advertisement -