చిరు 151లో ఐష్‌ ‌..!

238
Aish in Chiranjeevi's 151th movie
- Advertisement -

‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లతో సత్తా చాటి… తనలో జోరు తగ్గలేదని నిరూపించారు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు ఇప్పుడు వ‌రుస‌గా త‌న సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే 151వ సినిమా సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌నుంది. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌చ‌రిత్ర‌గా ఈ సినిమా తెర‌కెక్కనుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ ను నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.  ఈ చిత్రంలో చిరంజీవి సరసన బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ నటించబోతోందనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంలో సినిమా యూనిట్ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వాస్తవానికి చిరు 150లోనే ఐష్ నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలన్ని పుకార్లుగానే మిగిలిపోయి చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా మరోసారి 151వ సినిమా ఐష్‌తో చిరు రొమాన్స్ చేయనున్నాడన్న వార్త ఫిలింనగర్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇక ఈ సినిమా త‌ర్వాత చిరు త‌న 152వ సినిమాను టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను డైరెక్ష‌న్‌లో చేయనుండగా ఈ సినిమా  గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో తెరకెక్కనుంది. దీని తర్వాత చిరు 153 కోసం అశ్వినీద‌త్.. 154 కోసం జెమిని కిర‌ణ్ సిద్ధంగా ఉన్నార‌ని చిరు ఇటీవ‌లే చెప్పాడు. ఈ నాలుగు సినిమాల‌తో చిరు వ‌చ్చే రెండేళ్ల‌లో ర‌ప్ఫాడించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

- Advertisement -