యూజర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్..

236
airtel
- Advertisement -

యూజర్స్‌కు షాకిచ్చింది ఎయిర్‌టెల్. రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచింది. అయితే ఇది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే. హర్యానా, ఒడిశాలో కనీస రీఛార్జ్ మొబైల్ ప్లాన్ ధరను పెంచింది. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టు చేసింది.

ఈ రెండు రాష్ట్రాల్లో కనీస నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర దాదాపు 57 శాతం పెరిగి రూ.155కి చేరుకుంది. ఇప్పటివరకు, హర్యానా, ఒడిశాలో ఎయిర్‌టెల్ కనీస రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 99గా ఉంది. సెకనుకు రూ. 2.5 పైసల చొప్పున 200 MB మొబైల్ డేటా, కాల్‌లను అందించింది. ఇప్పుడు దానిని రూ. 155కి పెంచి 1 జీబీ డేటాతో పాటు 300 ఎస్సెమ్మెస్‌లను అందించింది. ఈ పెంపు కనిష్ట రీఛార్జ్ వాల్యూలో 57 శాతం పెరిగినట్లు.

ఇవి కూడా చదవండి..

 

- Advertisement -