ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌..

215
Airtel doubles data offer on broadband plans..
- Advertisement -

టెలికామ్ రంగంలో పెను సంచలనానికి తెరతీసిన రిలయన్స్ జియో మిగతా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్  తమ కస్టమర్లు చేజారిపోకుండా కాపాడుకోవడం కోసం ఎత్తుగడలు వేస్తోంది. ‘అతి తక్కువ ధరకు డేటా… ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్ కాల్స్ ఫ్రీ’.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నోటి నుంచి వచ్చిన ఈ రెండు మాటలు ఎయిర్‌టెల్, కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. దీంతో రిలయన్స్ జియోకు టెలికాం కంపెనీలు చుక్కలు చూపుతున్నాయి.
Airtel doubles data offer on broadband plans..
ఇదే క్రమంలో టెలికాం మార్కెట్లో పోటాపోటీగా తలపడుతున్న  ఎయిర్ టెల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లు, ప్రస్తుతం బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోనూ సంచలనాలు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. జియో ఫైబర్ సర్వీసులు ప్రారంభించడానికి ముందే, భారతీ ఎయిర్ టెల్ తన బ్రాడ్ బ్యాండు సర్వీసుల్లో హై-స్పీడు డేటా ప్రయోజనాలను 100శాతం రెట్టింపు చేయడం ప్రారంభించింది. తన కస్టమర్లు జియోకు మరలకుండా కాపాడుకోవడానికి ప్లాన్స్ లో డేటా ప్రయోజనాలను రెట్టింపు చేస్తోంది. 899 రూపాయల ప్లాన్ కింద ఆఫర్ చేస్తున్న 30జీబీ హైస్పీడ్ డేటాను, 60జీబీకి పెంచింది.

అదేవిధంగా రూ.1099 ప్లాన్ కింద ఆఫర్ చేసే 50జీబీ డేటాను ప్రస్తుతం 90జీబీకి పెంచుతున్నట్టు ప్రకటించింది. 1299 రూపాయల ప్లాన్ కింద ఆఫర్ చేసే 75జీబీ డేటాను 125జీబీకి, 1499 రూపాయల ప్లాన్ కింద ఆఫర్ చేసే 100జీబీ డేటాను 160జీబీకి పెంచుతున్నట్టు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క సిటీలోనూ ఈ డేటా ప్రయోజనాల ఇంక్రిమెంట్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది. అన్ని ప్లాన్స్ కింద ఏ నెట్ వర్క్ కైనా, అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది.
 Airtel doubles data offer on broadband plans..
ప్రస్తుతం బిల్ సైకిల్ నుంచి ఇప్పటికే తమ నెట్ వర్క్ పై ఉన్న కస్టమర్లు ఆటోమేటిక్ గా కొత్త ప్రయోజనాలోకి మారతారని తెలిపింది. కొత్త కస్టమర్లు డేటా ప్రయోజనాలు బట్టి డేటా ప్లాన్స్ ను ఎంపికచేసుకోవచ్చని చెప్పింది.  ఫ్యూచర్ రెడీ నెట్ వర్క్ ను ఎయిర్ టెల్ రూపొందించిందని, ఇందులో భాగంగానే వీ-ఫైబర్ ను లాంచ్ చేసిందని తెలిపింది. వీఫైబర్ తో హోమ్స్ కు 100 ఎంబీపీఎస్ స్పీడు వరకు సూపర్ ఫాస్ట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందిస్తున్నట్టు పేర్కొంది.

- Advertisement -