ఎయిర్‌టెల్‌.. ఎక్కడైనా ఫ్రీ

218
- Advertisement -

టెలికాంలో జియో రాకతో ఆకాశంలో ఉన్న డేటా టారిఫ్ లు అందుబాటులోకి వస్తున్నాయి. రిలయన్స్ సంస్థ ఎప్పుడైతే జియో ఆఫర్ ప్రకటించిందో అప్పటి నుంచి తమ మొబైల్  వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి టెలికాం కంపెనీలు. తాజాగా ఎయిర్‌టెల్‌.. ఇంటర్నేషనల్‌ రోమింగ్‌పై అపరిమిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను ఇస్తున్నట్టు బుధవారంనాడు ప్రకటించింది. ఈ ఆఫర్ కింద అంతర్జాతీయంగా అన్ని ఇన్‌కమింగ్స్ కాల్స్ ఇక ఉచితంగా అవుతాయి. అలాగే ఎయిర్‌టెల్ నెంబరును ఏ దేశంలోనైనా వాడుకునే అవకాశాన్ని కల్పించాలని బావిస్తొంది.

ఈ మేరకు కంపెనీ కొత్త రోమింగ్‌ ప్యాక్స్‌ను విడుదల చేసింది. ఈ ప్యాక్‌ల్లో భాగంగా ఉచితంగా భారతకు మెసేజ్‌లు, కాలింగ్‌ మినిట్స్‌ను పొందడంతోపాటు అధిక డేటా ప్రయోజనాన్ని అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఉచిత వినియోగ పరిమితి దాటిన తర్వాత లోకల్‌ ఇన్‌ కంట్రీ కాల్స్‌పై నిమిషానికి 3 రూపాయల చార్జీని వసూలు చేయనుంది. 30 రోజులు, ఒక రోజు కాలపరిమితితో ఎయిర్‌టెల్‌ కొత్త రోమింగ్‌ ప్యాక్‌లు అందుబాటులోకి వచ్చాయి.

ఎక్కువ కాల్ చార్జీ, డేటా రీచార్జీలపై ఆందోళన అవసరం లేదని ఈ ప్యాక్ పోస్టు పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగారులందరికీ వస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్ ఆఫర్ కింద ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, ఇండియాకు ఉచితంగా మెసేజ్‌లు చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు అన్ని ప్రముఖ దేశాల నుంచి ఇండియాకు ఉచితంగా కాల్స్ చేసుకోవడంతోపాటు డేటా ప్రయోజనాలు కూడా అందిస్తామని పేర్కొంది. ఈ ప్యాక్ కాలపరిమితి 30 రోజులు అని పేర్కొంది. ఒక్క రోజు మాత్రమే విదేశాల్లో గడిపేవారు వన్‌డే ప్లాన్ కింద 10 డాలర్లు(రూ.649) చెల్లించాలని, నెలకు అయితే 30 రోజుల ప్యాక్ కింద 75 డాలర్లు(రూ.4,999) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.ఈ ఆఫర్‌ వల్ల యుఎస్‌, కెనడా, యుకె, సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి గమ్యస్థానాలకు వెళ్లే వారికి అధికంగా ప్రయోజనం కలుగనుంది.

- Advertisement -