Iran War:విమాన సర్వీసులు ప్రారంభం

1
- Advertisement -

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య విమాన సర్వీసులు క్రమంగా పునరుద్ధరించబడుతున్నాయి. భారత్ నుంచి దుబాయ్‌కి వెళ్లే విమానాలను ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో మళ్లీ ప్రారంభించాయి.

కొన్ని రోజులుగా ఎయిర్‌స్పేస్ పరిమితుల కారణంగా నిలిచిపోయిన సర్వీసులు, తాజా అనుమతుల తర్వాత తిరిగి ప్రారంభమవుతున్నాయి. అయితే యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున కొన్ని నగరాలకు విమానాలు ఇప్పటికీ నిలిపివేయబడ్డాయి.

మార్చి 19న మొత్తం 48 ఎయిర్ ఇండియా విమానాలు పశ్చిమ ఆసియా ప్రాంతానికి వెళ్లేలా షెడ్యూల్ చేయబడ్డాయి. వీటిలో 16 రెగ్యులర్ సర్వీసులు, 32 అదనపు ప్రత్యేక విమానాలు ఉన్నాయి. ఈ విమానాల్లో కొన్ని దుబాయ్‌కు ప్రయాణికులను కనెక్ట్ చేస్తాయి.

ఇండిగో ప్రకారం..దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి వచ్చిన తాజా సమాచారం మేరకు మార్చి 18 సాయంత్రం 4 గంటల నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.

Also Read:హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఇక ఆకాశ ఎయిర్‌ కూడా దశలవారీగా సర్వీసులను పునరుద్ధరిస్తోంది. రియాద్–ముంబై మధ్య విమానాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయని తెలిపింది. అలాగే జెడ్డా నుంచి అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కోచి నగరాలకు సర్వీసులు కొనసాగుతున్నాయి.

అయితే అబుదాబి, దోహా, కువైట్ నగరాలకు ఆకాశ ఎయిర్ విమానాలు మార్చి 21 వరకు నిలిపివేయబడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

- Advertisement -