జనవరి 27 వ తేదీన టాటా సంస్థ ఎయిర్ ఇండియాను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నది. దీంతో ఇవాళ్టి నుండి ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ మొదలుపెట్టనుంది. ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మారుస్తామని టాటా సంస్థ ప్రకటించింది.
ఓ ప్రత్యేకమైన ప్రకటనతో ప్రయాణికులకు స్వాగతం పలకబోతోంది ఎయిర్ ఇండియా. ఇకపై టైం టు టైం సర్వీసులు నడపడంతో పాటు, మెరుగైన సేవలందించడంపైనే టాటా ఫోకస్ చేయబోతోంది. ఏడు దశాబ్దాల తర్వాత ఎయిరిండియా టాటా సంస్థలో విలీనమైంది.
1932లో టాటాలు నెలకొల్పిన టాటా ఎయిర్ సంస్థ ఆనంతర కాలంలో ఎయిర్ ఇండియాగా మారింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ సంస్థను కొనుగోలు చేసింది. కొంతకాలం బాగానే నడిచినప్పటికీ, ప్రైవేటు విమానయాన సంస్థలకు అవకాశం కల్పించడంతో క్రమంగా ఎయిర్ ఇండియా చిక్కులు వచ్చి పడ్డాయి. అప్పులు అయ్యాయి. కాగా, అప్పట్లో ఎవరి నుంచి ఎయిర్ ఇండియాను దక్కించుకున్నారో, ఇప్పుడు తిరిగి వారికే అప్పగించారు.