శశికళకు షాక్‌ ఇచ్చిన అన్నాడీఎంకే..!

247
sasikala
- Advertisement -

మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు మరో షాక్ ఇచ్చింది అన్నాడీఎంకే. ఇప్పటికే ఆమెను పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పిన అన్నాడీఎంకే నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. ఈనెల 7 వ తేదీన శశికళ తమిళనాడులోకి అడుగుపెట్టిన వెంటనే ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు టీవీవీ దినకరన్ వర్గం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా చెన్నైలోని మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత సమాధిని దర్శించుకొని అక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాలని భావించారు.

అయితే శశికళ ఎత్తుగడను ముందే పసిగట్టిన అన్నాడీఎంకే నేతలు మరమ్మత్తుల కారణంగా ఈనెల 15 వరకు అమ్మ సమాధిని ఎవరూ సందర్శించరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సింపతి పొందాలని చూసిన శశికళ వర్గానికి షాక్ తగిలినట్లైంది.

ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో నాలుగేళ్ల శిక్షను అనుభవించిన శశికళ ఇటీవలే విడుదలయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న శశికళ ఈనెల 7 వ తేదీన బెంగళూరు నుంచి చెన్నైకి రానున్నారు.

- Advertisement -