AI ప్రభావం సాఫ్ట్ వేర్ ఉద్యోగులపైనే ఎక్కువగా ఉంది. 9 ,000 మంది ఉద్యోగుల్ని తొలగించనుంది మైక్రోసాఫ్ట్. సంపాదన మొత్తం ఖర్చు పెట్టే సంస్కృతికి , ఆ మాటకొస్తే క్రెడిట్ కార్డు కల్చర్ ( అంటే రేపటి సంపాదన ను ఇవ్వాళే ఖర్చుపెట్టడం ) కు అలవాటు పడిన వీరు ఎలా తట్టుకొంటారో ? చూడాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
1 . ఉద్యోగం పోయినా కనీసం రెండేళ్లు బతకడానికి సరిపడా డబ్బు పొదుపు చేసుకోండి.
2. గొప్పలకు పోయి వృధాగా ఖర్చు పెట్టొద్దు.
3 . చీమల్లా బతకాలి. మిడతల్లా అందుబాటు లో ఉన్నది మొత్తం తినేయడం కాదు.
ఇన్నాళ్లు తెలుగోళ్లు సాఫ్ట్వేర్ ఇంకా వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఉంటే బ్లూ కాలర్ పనులకోసం బీహార్ ,వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్ ,రాజస్థాన్ ఇంకా ఈశాన్య రాష్ట్రాల వారు ఇక్కడ. బతుకు తెరువు కోసం తెలుగు వారు బ్లూ కాలర్ ఉద్యోగాలు చేయాల్సిన కాలం ఎంతో దూరం లో లేదా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read:రూ.4 లక్షల భరణం చెల్లించాల్సిందే!

