- Advertisement -
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది కంట్రోల్ ఎస్. రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూపై సంతకాలు చేశారు కంపెనీ ప్రతినిధులు.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది కంపెనీ.
400 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పడనుంది డేటా సెంటర్. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి.
Also Read:రెండో రోజు సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు..
- Advertisement -

