ఆహా… ‘తరగతి గది దాటి’ సక్సెస్ సెలెబ్రేషన్స్

264
Tharagathi Gadhi Dati Success Meet
- Advertisement -

తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. రకరకాల వెబ్ సిరీస్‌లతో కొత్తకొత్త సినిమాలతో.. ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తుంది ఆహా. ఇప్పటికే ఆహా వేదికగా తరగతి గది దాటి వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆహా అనిపించింది. తరగతి గది దాటి సక్సెస్ మీట్‌ను హైదరాబాద్ లోని ఫోరం సుజనా మాల్‌లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘తరగతి గది దాటి’ నటి నటులు హీరో హర్షిత్ రెడ్డి, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మరియు ఎస్ ఆర్ కల్యాణమండపం హీరో కిరణ్ అబ్బవరం మరి కొంతమంది నటులు పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా థియేటర్లలో విడుదలై వెండితెరపై మంచి విజయాన్ని అందుకున్న ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా త్వరలోనే ఆహా…ప్రేక్షకులను అలరించినుంది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. త్వరలో ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ కూడా రానుంది అని తెలిపారు. వరుసగా ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ షో ఇలా ఏదో ఒక ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ఆహా ప్రేక్షకాదరణ పొందుతుంది.

ఆహా త్వరలో కిడ్స్‌ను కూడా అలరిచేందుకు కిడ్స్ ఒరిజినల్ షోలతో మన కథలు మన విలువలు పోగ్రామ్స్ మరి కొన్ని పోగ్రామ్స్‌తో ఆహా మీ ముందుకు రానుంది. ఆహాలో ఇప్పటికే ఉన్న వెబ్ సిరీస్ మరియు సినిమాలు – లెవ‌న్త్ అవ‌ర్‌, క్రాక్‌, జాంబి రెడ్డి, నాంది, సుల్తాన్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌, వెబ్ షోస్ మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా మెప్పిస్తాయి. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలు, షోలతో మరింత వినోదం అందివ్వనుంది ఆహా..

- Advertisement -