హాట్ యాంకర్ రష్మిగౌతమ్, జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ లవ్ ఎఫైర్ అందరికీ తెలిసిందే. హాట్ పెయిర్‌గా స్పాంటెనెస్ పంచులతో ఫ్యాన్స్ అలరించే వీరిద్దరిపై ఎన్నో గాసిప్స్ వచ్చాయి. జబర్దస్త్ కామెడీ షోలో సమయంలో రష్మి-సుధీర్ ల మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని త్వరలో పెళ్లి చేసుకుంటారన్న పుకార్లు షికార్ చేశాయి. అయితే పలుమార్లు వీరిద్దరూ తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని చెప్పిన గాసిప్స్ మాత్రం ఆగలేదు.
తాజాగా గాసిప్స్ ను నిజం చేస్తూ వీరిద్దరు పెళ్లి చేసుకున్న పోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంగరంగ వైభవంగా అతిరథ మహారథుల మధ్య వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. అయితే,ఇదంతా నిజజీవితంలో కాదండి..బుల్లి తెరపై. టీవీ స్టూడియోలో ఓ షో కోసం వీరిద్దరు పెళ్లి చేసుకున్న ఫోటో నెట్టింట్లో వైరలైంది.
మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ త్వరలో అహనాపెళ్లంట అనే కోత్త షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ షోలో యాంకర్‌లుగా వీరిద్దరు నటించనున్నారట. షో కోసం తీసిన ప్రోమోలో వీరిద్దరు పెళ్లిచేసుకోగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోండగా… యు ట్యూబ్ లో ట్రెండింగ్లో 4 స్ధానంలో నిలిచింది.