అల్ పార్టీ మీటింగ్ కేవలం తంతుగానే మారిందని.. మాట్లాడుకున్న అంశాలు అమలు కావడం లేదన్నారు టీఆర్ఎస్ పీపీ నేత ఎంపీ కె .కేశవ రావు అన్నారు. శనివారం జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ఎంపీ కేకే పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఉన్నదే ప్రజా సమస్యలపై చర్చించడం కోసం. అప్పుడే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. రైతు చట్టాలను మేము వ్యతిరేకించాము. అందులో మా స్టాండ్ మారలేదు. వివాదాస్పద అంశలున్న నేపథ్యంలో కనీసం సెలెక్ట్ కమిటీకి పంపమన్నా కేంద్రం అంగీకరించలేదు. ప్రస్తుతం రైతులతో ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో చర్చలు జరపడం మంచి పరిణామన్నారు. అయితే జనవరి 26 హింస సరికాదు. ఎవరైనా ఖండించాల్సిన అంశం..అంత మాత్రాన దీన్ని సాకుగా తీసుకుని రైతు సమస్యలు, డిమాండ్లు విస్మరించవద్దని కేకే వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తున్నామని.. అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. విభజన చట్టంలో ఇంకా అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై చర్చ జరగాలి. ఓబీసీ రిజర్వేషన్ విషయంలో చర్చ జరగాలి. కొత్తగా ఇచ్చే రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కాకపోతే ఇందులో లోపాలు సరిదిద్దాలి. ఓబీసీకి ఒక మంత్రిత్వశాఖ కావాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కూడా చర్చ జరపాలి. ఇది చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సరికాదు అని మేము భవించాము. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తే జనవరి 26 హింసను సమర్ధించినట్టు అవుతుందని భవించాము. ఇక కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను మేము ఆనాడే వ్యతిరేకించాము. వ్యవసాయం రాష్ట్ర అంశం. దానిపై జాతీయ స్థాయిలో చట్టాలు తేవడం అంటే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే అని కేకే పేర్కొన్నారు.