- Advertisement -
ఓ వైపు దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకొచ్చిన అగ్రివీర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండగానే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో ఇండియన్ ఆర్మీ మొదటగా అగ్నివీర్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
అగ్నిపథ్ స్కీమ్ ద్వారా నేవీలోకి మహిళా నావికులను రిక్రూట్ చేయనున్నట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. శిక్షణ కాలం పూర్తి అయిన తర్వాత ఆ మహిళా నావికులకు యుద్ధ నౌకల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఆఫీర్స్ ర్యాంక్ కన్నా తక్కువ ఉన్న ర్యాంకుల్లోనూ మహిళలను రిక్రూట్ చేయనున్నారు.
అగ్నివీరులకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని, వాళ్లకు డీఏ, మిలిటరీ సర్వీస్ పే ఉండదని ఆర్మీ తెలిపింది. అందరి తరహాలోనే రేషన్, డ్రెస్, ట్రావెల్ అలోవెన్స్‌లు అగ్నివీర్ సైనికులకు అందుతాయి. నాలుగేళ్ల కాలానికి 48 లక్షల జీవిత బీమా వస్తుంది.
- Advertisement -