టీజర్‌తో ‘అజ్ఞాతవాసి’ రికార్డ్..

250
- Advertisement -

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం టీజర్‌ శనివారం విడుదలైంది. విడుదలకుముందే ‘అజ్ఞాతవాసి టీజర్‌ డే’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇండియా ట్రెండ్స్‌లో నాలుగో స్థానంలో ఇది నిలిచింది. ఈ టీజర్‌ టాలీవుడ్‌లో అత్యధిక మంది లైక్‌ చేసిన టీజర్‌గా మరో ఘనత సాధించింది. ఇప్పటివరకు ఈ టీజర్‌కు 3,65,000కు పైగా లైక్‌లు వచ్చాయి. ‘అజ్ఞాతవాసి’లో కీర్తి సురేశ్‌తో పాటు అను ఇమ్మాన్యుయేల్‌ మరో కథానాయికగా నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వంవహిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్‌ 19న ఆడియో విడుదల వేడుకను నిర్వహించనున్నారు. జనవరి 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Agnathavasi Teaser Breaks All Records

పవన్‌కల్యాణ్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’. గతంలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. దీంతో తాజా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు ఓవర్సీలోనూ పెద్దఎత్తున సినిమాను విడుదల చేస్తున్నారు. గతంలో ఏ తెలుగు చిత్రమూ విడుదల కాని స్థాయిలో ఏకంగా 209 లొకేషన్లలో ‘అజ్ఞాతవాసి’ విడుదల కానుంది.

- Advertisement -