అఘోరి హల్‌చల్‌..పోలీసుపై దాడి

6
- Advertisement -

విజయవాడ వెళ్లే రహదారి పైన అఘోరి హల్ చల్ చేశారు. మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైటాయించింది అఘోరి .తను పవన్ కళ్యాణ్‌ని కలవాలి అంటూ పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత వెళ్తాను ఆంటూ హైవే పైన బైటాయించింది.

రోడ్డుపై ట్రాఫిక్ జాం కావడంతో ఆమెను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు ఓ పోలీస్ పై చేయి చేసుకోవడమే కాదు పిడి గుద్దులు గుద్దారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయే పరిస్థితి నెలకొంది.

నిన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో తన కారు సర్వీసింగ్ చేయించుకుంటున్న సందర్భంలో వీడియో తీసేందుకు వచ్చిన ఓ విలేకరిపై అగోరి దాడి చేశారు. గాయాల పాలు కావడంతో ఆ విలేకరిని స్థానిక ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు.

Also Read:మొట్టమొదటి మహిళా బస్ డిపో

- Advertisement -