అఖిల్‌ ‘ఏజెంట్‌’కు ముహుర్తం ఖరారు..

61
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌ ప్రస్తుతం ‘ఏజెంట్‌’ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక మూవీలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యపాత్రలో నటిండం విశేషం. తాజాగా ఈ చిత్రం నుండి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఆగస్టు 12 ఏజెంట్‌ విడుదల చేస్తున్నామంటూ చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమాకు అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అఖిల్‌ను మునుపెన్నడూ చూడని డాషింగ్ లుక్‌లో ప్రెజెంట్ చేశారు. అఖిల్ యాక్షన్-ప్యాక్డ్‌ రోల్‌లో సరికొత్తగా కనిపించనున్నాడు.

- Advertisement -