ఏజెంట్ పై హాట్ డిస్కషన్

17
- Advertisement -

అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమై ఏడేళ్ళు దాటేసింది. అయినా ఈ యంగ్ హీరోకి సరైన హిట్ పడలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యావరేజ్ అనిపించుకుంది తప్ప భారీ వసూళ్లు అందుకోలేకపోయింది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అఖిల కూడా సురేందర్ రెడ్డి తో చేస్తున్న ఏజెంట్ మీదే భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

ఈ సినిమా షూటింగ్ చాలా నెలలుగా జరుగుతుంది. మేకింగ్ కోసం కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఛాలెంజింగ్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమా రెడీ చేస్తున్నాడు. ముందు అనుకున్న ఖర్చు కంటే ఇప్పుడు మూడింతలు ఎక్కువైందని టాక్.

మొదట ఈ సినిమాను ముప్పై కోట్లల్లో తీయాలనుకున్నారు. అందుకే అఖిల తనకి రెమ్యూనరేషన్ వద్దని చెప్పేశాడు. సురేందర్ రెడ్డి మాత్రం 8 కోట్లకు పైనే తీసుకున్నాడట. దీంతో సినిమాకు ఇప్పటి వరకూ వడ్డీ లతో కలిపి 80 కోట్ల బడ్జెట్ అయిందట. దీంతో మేకర్స్ భయ బ్రాంతులతో ఉన్నారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు 35 కోట్ల థియేటర్స్ ప్రీ బిజెనెస్ చేశారు. మిగతా బడ్జెట్ ను నాన్ థియేట్రికల్ రూపంలో డబ్బింగ్ రూపంలో తెచ్చుకునే ప్లానింగ్ లో ఉన్నారు. ఏమైనా ఇప్పుడు అఖిల ఏజెంట్ బడ్జెట్ , బిజెనెస్ నంబర్స్ తో ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ అవుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ ఎంత వసూలు చేస్తాడో ?

ఇవి కూడా చదవండి…

గ్రంథాలయం ట్రైలర్‌ విడుదల…

‘కస్టడీ’ నుంచి చైతు రిలీజ్ !

మార్చి 3న మనోజ్ పెళ్లి ఖరారు

- Advertisement -