‘ఏజెంట్’ అఖిల్ వచ్చేస్తాడా ?

27
- Advertisement -

అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఏడాది పైనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కాబోతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే అల్మోస్ట్ ఘాట్ ఫినిష్ చేసేశారు. ఇంకా రెండు పాటలు కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ లో ఉంది. అఖిల్ CCL తో బిజీ అయిపోవడంతో ఘాట్ పెండింగ్ పడింది.

అయితే సినిమా రిలీజ్ కి ఇంకా రెండు నెలలే ఉంది. ఈ లోపు షూటింగ్ ఫినిష్ చేసెయ్యడం పక్కా కానీ ఇంకా సినిమాకు సంబందించి ప్రమోషన్స్ గట్టిగా చేయడం లేదు. రెండు నెలల్లో సినిమా రిలీజ్ పైగా పాన్ ఇండియా రిలీజ్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలానే ఉంటుంది. మరి అఖిల్ ఏజెంట్ తో ప్రకటించిన డేట్ కే థియేటర్స్ లోకి వస్తాడా ? అనే సందేహాలు మొదలవుతున్నాయి.

ఈ సినిమాకు ముప్పై కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అరవై కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అఖిల్ మీద ఇంత బడ్జెట్ పెట్టడంతో బిజినెస్ కూడా మేకర్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. అనుకున్నట్టు బిజినెస్ జరగపోవడం కూడా సినిమా అలస్యానికి కారణం అవుతుందా ? అనే చర్చ నడుస్తుంది.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : మత్తెక్కించే కళ్లతో పిచ్చెక్కించింది!

రానానాయుడు..మోస్ట్‌ వాచ్డ్‌ #1ఇన్ నెట్‌ఫ్లిక్స్‌

ఆస్కార్ కమిటీ పైనే అసంతృప్తా ?

- Advertisement -