నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 29 నుండి 31వ తేదీల్లో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఆగస్టు 29వ తేదీ సాయంత్రం విఘ్నేశ్వర స్వామివారి పూజ, యాగశాల పూజ, అంకురార్పణ నిర్వహిస్తారు.
ఇందులోభాగంగా ఆగస్టు 30న ఉదయం యాగశాల పూజ, పూర్ణాహుతి, సాయంత్రం యాగశాలలో పవిత్రోత్సవాలకు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 31న ఉదయం పూర్ణాహుతి, పట్టుపవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు.
ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు పితామహులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా పానవట్టాన్ని అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చింది.
Also Read:భారత్‌కు ట్రంప్ నోటీసులు

