జూ.ఎన్టీఆర్ పై మళ్లీ రచ్చ.. బాలయ్య కూడా

46
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రోజులు గడుస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ ఇంత వరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి మీడియా సమావేశంలో ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ… ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయననే అడగాలని చెప్పారు. తనను అడిగితే తాను ఏం చెపుతానని.. ఎవరినీ స్పందించాలని మేం అడగమని చెప్పారు. నిజానికి పార్టీలోని ఇదే విషయాన్ని పలువురు నాయకులు బాలయ్యని అడిగితే.. వాడు సపోర్ట్ చేస్తే ఎంత?, చేయకపోతే ఎంత?, మేమెవ్వరికి బొట్టు పెట్టి పిలవం అంటూ కామెంట్స్ చేశారు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, కొర‌టాల శివ‌తో దేవ‌ర సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ షూట్ నుంచి కొంచెం గ్యాప్ రావ‌డంతో ఎన్టీఆర్ ఫ్యామిలీతో వెకేష‌న్ కోసం విదేశాల‌కు చెక్కేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తారక్ కావాలనే విదేశాల‌కు వెళ్ళాడు అని, చంద్రబాబు నాయుడికి కనీస మద్దతు కూడా ఇవ్వకుండా ఎన్టీఆర్ ఇలా బిహేవ్ చేయడం అతనికి మంచిది కాదు అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌తో దేవ‌ర సినిమా చేస్తున్న ఎన్టీఆర్, ఓ యంగ్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. టాక్సీవాలా సినిమా డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్య‌న్‌తో ఎన్టీఆర్ మూవీ చేయ‌నున్నాడ‌ట‌. ఎన్టీఆర్ కోసం రాహుల్ ఓ పీరియాడిక్ డ్రామాను రెడీ చేసిన‌ట్లు స‌మాచారం. ఒకవేళ ఈ కాంబో నిజ‌మైతే మాత్రం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి చాలానే టైమ్ ప‌ట్ట‌నుంది.

Also Read:KTR:జిల్లాకో మెడికల్ కాలేజీ

- Advertisement -