ముఖ్య‌మంత్రిపై కారంతో దాడి..

249
aravind
- Advertisement -

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పై ఓ వ్య‌క్తి దాడి చేశాడు. ముఖ్య‌మంత్రిపై కారంపోడి చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నించాడు. సాక్షాత్తూ స‌చివాల‌యంలోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. కారంపొడి చ‌ల్లిన అనిల్ అనే వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు క‌స్ట‌డిలో ఉన్న నిందితుడిని అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.

kejriwal

ముఖ్యమంత్రి భోజనం కోసం బయటకు వెళుతుండగా మూడో అంతస్తులోని సీఎం చాంబర్‌కు అత్యంత సమీపంలో ఈ దాడి చేసినట్టు చెబుతున్నారు అధికారులు. ఈసంద‌ర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ట్వీట్ చేసింది. ఇది ఢిల్లీ పోలీసుల తీవ్రమైన భధ్రతా లోపం. ముఖ్యమంత్రికే రక్షణ కరువైంది అంటూ ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. గ‌తంలో కూడా కేజ్రీవాల్ మీద ఇంకు దాడి జ‌ర‌గాగా మ‌రోసారి ఈదాడి క‌ల‌క‌లం రేపుతోంది.

- Advertisement -