చిరు…కాఫీ వచ్చేసింది…!

233
After Chiru dosa now coffee..
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలో అగ్రహీరోగా ఎదిగిన చిరు కోట్లాదిమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. చిరు పేరిట రకరకాల వస్తువులు మార్కెట్‌లోకి వచ్చాయి. చివరికి చిరు దోశ కూడా అందరికి తెలిసిందే. చిరంజీవి ఫ్యామిలీకే సొంతమైన ఈ దొశకు ఫిదా కానీ సెలబ్రిటీలు లేరు. బిగ్ బి అమితాబ్ ,రజనీకాంత్,సచిన్‌ చిరు దోశకు ఫ్యాన్స్‌.

After Chiru dosa now coffee..
ఇక తాజాగా చిరంజీవి పేరుతో కాఫీ వచ్చేసింది. దీనిని ప్రారంభించింది ఎవరో కాదు. ఆయన కోడలు,అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ ఛైర్మన్ ఉపాసన. ‘అపోలో ఫౌండేషన్‌’ తరఫున  ‘కేఫ్‌’ పేరిట జూబ్లీహిల్స్‌లోని అపోలో ఎఫ్‌ఎన్‌డీ థియేటర్‌ వద్ద కాఫీ షాపును ప్రారంభించింది.

ఈ విషయాన్ని  కొణిదెల ఉపాసన ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ‘హే.. ఈ కేఫ్‌కి వచ్చి రిలాక్స్‌ అవ్వండి’ అని ట్వీట్‌ చేస్తూ దీనికి సంబంధించిన వివరాలు పోస్ట్‌ చేశారు.ఈ కేఫ్‌లో చిరుస్‌ ఫిల్టర్‌ కాఫీ, హైదరాబాదీ కేసర్‌ రోస్‌ టీ, లుఖ్మి చికెన్‌, లామకాన్‌ వరల్డ్‌ ఫేమస్‌ సమోసా మిర్చి బజ్జీ అమ్ముతున్నారట.

- Advertisement -