దీదీకి మద్దతుగా రాజ్‌ థాక్రే..

251
mamatha raj thackrey
- Advertisement -

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విపక్షాలు మద్దతుగా పలికాయి. విపక్ష నేతలు దేవెగౌడ్, స్టాలిన్, తేజస్వీ యాదవ్, ఓమర్ అబ్దుల్లా,కాంగ్రెస్ చీఫ్‌ రాహుల్ గాంధీ పూర్తి మ‌ద్ద‌తుగా ఉంటామని చెప్పగా తాజాగా మహారాష్ట్ర నవ నిర్మాన్ సేన(ఎంఎన్‌ఎస్‌) మద్దతు పలికింది.

కేంద్ర ప్ర‌భుత్వ ద‌మ‌న‌నీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న దీదీకి తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు రాజ్‌థాక‌రే తెలిపారు. కేంద్ర నిరంకుశ‌త్వ పాల‌న‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని, అందుకే మమతకు మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని చెప్పారు.

అసలేం జరిగిందంటే శార‌దా చిట్‌ఫండ్ కేసులో కోల్‌క‌తా పోలీసు క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ స‌హ‌క‌రించ‌డం లేద‌ని సీబీఐ విచారణకు వెళ్లింది. దీనిని వ్య‌తిరేకిస్తూ దీదీ కేంద్రంపై పోరాటానికి దిగారు. సీపీ ఇంటికి చేరుకోగా ఆ త‌ర్వాత బెంగాల్ పోలీసులు .. సీబీఐ అధికారుల‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అక్క‌డ హైడ్రామా చోటుచేసుకుంది. మోడీ సర్కార్ తమపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని మమత తీవ్ర స్ధాయిలో మండిపడింది.

- Advertisement -