టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘానిస్తాన్ సంచలనం సృష్టించింది. సూపర్ 8 పోరు కీలకమ్యాచ్‌లో ఆసీస్‌ను 21 పరుగుల తేడాతో చిత్తు చేసింది ఆప్ఘానిస్తాన్. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాక్స్‌వెల్ 59 పరుగులు చేయగా మార్ష్ 12,స్టాయినిస్ 11 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. దీంతో ఆసీస్ ఓటమి తప్పలేదు.
అఫ్ఘాన్ విజయంలో బౌలర్ గుల్బాదిన్ నైబ్ కీలకపాత్ర పోషించాడు. 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీయగా నవీనుల్ హక్ 3 వికెట్లు , రషీద్ ఖాన్, ఒమర్జాయ్ చెరో వికెట్ తీశారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక ఆసీస్ కెప్టెన్ కమిన్స్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒక వరల్డ్ కప్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు కమిన్స్.
Also Read:పేక మేడలు…ఫస్ట్ సింగిల్