- Advertisement -
సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నిన్న (గురువారం) రాత్రి జరిగిన మ్యాచ్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఉత్కంఠను తలపించిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. నాలుగు ఓవర్లు వేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ ను కూడా పడగొట్టాడు. దీంతో పాటు మ్యాన్ ఆఫ్ దీ మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.
దీనికి తోడుగా అత్యధిక డాట్స్ బాల్స్ వేసిన మూడో క్రీడాకారుడిగా కూడా ఘనత సాధించాడు. గత ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధికంగా డాట్స్ బాల్స్ వేసిన ఐపీఎల్ క్రీడాకారులుగా రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రాలు రికార్డులో ఉన్నారు. ఈ రికార్డును అశ్విన్ రెండు సార్లు ఢీకొన్నాడు. తాజాగా వీరి సరసన రషీద్ ఖాన్ చేరాడు.
- Advertisement -