ఆఫ్ఘనిస్తాన్–పాకిస్థాన్..ఓపెన్ వార్

8
- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున పాకిస్థాన్ కాబూల్‌తో పాటు మరో రెండు ఆఫ్ఘన్ ప్రావిన్సులపై వైమానిక దాడులు జరిపిందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఇరు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలకు దారితీసింది.

తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, తమ దళాలు 19 పాకిస్థాన్ సైనిక పోస్టులు మరియు 2 సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి. అలాగే గురువారం రాత్రి ఒక ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది. ఈ ఘర్షణల్లో 55 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పాకిస్థాన్ నుంచి అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదు.

తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, వివాదాస్పద డ్యూరండ్ రేఖ వెంబడి కందహార్, హెల్మండ్ ప్రాంతాల్లో పాక్ సైనిక స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.మరోవైపు, పాకిస్థాన్ ప్రధాని ప్రతినిధి మోషర్రఫ్ జైదీ మాట్లాడుతూ, తమ దళాలు 27 తాలిబాన్ పోస్టులను ధ్వంసం చేసి, 9 పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. 80కు పైగా ట్యాంకులు, గోలాబారుద సామగ్రి ధ్వంసమైనట్లు పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ “ఓపెన్ వార్”లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది.

Also Read:ఒత్తిడితో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య..!

- Advertisement -