సౌతాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘాన్‌..సెమీస్ ప్రివ్యూ!

38
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో పసికూన ఆఫ్ఘానిస్తాన్ సత్తాచాటుతోంది. ఎవరూ ఊహించని విధంగా సెమీస్‌కు చేరింది ఆఫ్ఘాన్. ఇవాళ తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుండగా విజయం ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి ఆఫ్ఘానిస్తాన్ బ్యాటింగ్‌లో పేలవంగా ఉన్న బౌలింగ్‌లో మాత్రం పటిష్టంగా ఉంది. ఓపెనర్లు ఇద్దరు మినహా మిగితా బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో లేరు. ప్రతి మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరిలో ఎవరో ఒకరు రాణిస్తుండటంతో ఆఫ్ఘాన్‌ ఆమాత్రం స్కోరు చేయగలుగుతోంది. అయితే బౌలింగ్‌లో మాత్రం సమిష్టిగా రాణిస్తున్నారు రహ్మానుల్లా గుర్బాజ్ , ఇబ్రహీం జద్రాన్‌ బ్యాటింగ్ ఫామ్‌కు ఫజల్‌హాక్ ఫరూకీ, రషీద్,నవీన్-ఉల్-హక్ తోడైతే దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు.

ఇక దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది. క్వింటన్ డి కాక్,క్లాసెస్,మిల్లర్,మార్‌క్రమ్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్లకు తోడు నార్జే లాంటి బౌలర్‌ దక్షిణాఫ్రికాకు ప్రధాన బలం.

టీమ్‌ అంచనా..

ఆఫ్ఘానిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (wk), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, మొహమ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్ (c), నంగేలియా ఖరోటీ, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూఖీ

దక్షిణ ఆఫ్రికాఫ: క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ.

Also Read:ఆగస్టు 15న.. ‘ఆయ్’

- Advertisement -