తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అడ్వాకేట్ తన్నీరు శ్రీరంగారావును విద్యుత్ రెగ్యులేషన్ కమిషన్ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ నియామించడంపై నాంపల్లి కోర్టు న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేశారు. హుజుర్‌నగర్ టీఆరెస్ అభ్యర్థి సైదిరెడ్డిగెలుపు,అడ్వాకేట్ తన్నీరు రంగారావుకి విద్యుత్ రెగ్యులేషన్ కమిషన్ చైర్మన్‌గా నియమించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. నాంపల్లి కోర్టు న్యాయవాదులు కోర్టు ముందు టపాసులు పేల్చి,స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పని చేసిన న్యాయవాదులను గుర్తించి సముచిత స్థానం కల్పించారు…తనను విద్యుత్ రెగ్యులేషన్ కమిషన్ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో ముందున్న అడ్వాకేట్‌లకు ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలియజేశారు. కొంతం గోవర్ధన్ రెడ్డి,పులిగారి గోవర్ధన్ రెడ్డి,తన్నీరు శ్రీ రంగారావు లను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడంతో అడ్వాకేట్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.