అరవింద సమేత…ఎన్టీఆర్‌ షో

354
Advantage Aravinda Sametha- 2.47hours
- Advertisement -

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. రేపు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే యూఎస్ తో పాటు వివిధ దేశాల్లో ప్రీమియర్ షోలతో సందడి చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రీమియర్ షోలో ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ రాబట్టగలిగింది.

మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఇందులో మరోసారి అద్భుతమైన డైలాగులతో ప్రేక్షకులను మెప్పించాడని సినిమా ఎనలిస్ట్ ఉమైర్ సంధు తెలిపారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని… ఎన్టీఆర్ నుండి తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ దసరాకు పర్‌ఫెక్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అని చెబుతున్నారు.

రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ(చినబాబు) నిర్మించగా ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాకు ప్రధాన బలం ఎన్టీఆర్ అని ప్రీవ్యూ చూసిన వాళ్లు చెబుతున్నారు. వీర రాఘవరెడ్డి పాత్రను ఎన్టీఆర్ బ్యాలెన్స్ చేసిన తీరు చాలా బాగుందని కొనియాడుతున్నారు.ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, మాస్ స్టోరీ, హై ఆక్టేన్ యాక్షన్, రాకింగ్ మ్యూజిక్, సూపర్ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ సినిమాకు మేజర్ హైలెట్స్.

- Advertisement -