సీఐ మల్లికార్జునరెడ్డి సస్పెన్షన్..

170
Adultery case filed against Kalvakurthy Inspector
- Advertisement -

పోలీస్‌ శాఖలో మరోసారి అనైతిక వ్యవహారం రచ్చకెక్కింది. గతంలో అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో ఇన్‌స్పెక్టర్‌, మహిళా ఎస్సై ఒకే గదిలో ఉండగా ఆమె భర్త పట్టుకున్న ఉదంతాన్ని తలపిస్తూ హైదరాబాద్‌లో మరో సీఐ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఇన్‌స్పెక్టర్‌..అర్ధరాత్రి ఓ మహిళా ఏఎస్పీ ఇంట్లో నుంచి వస్తుండగా ఆమె భర్త మాటువేసి పట్టుకోవడం సంచలనం కలిగించింది.

ఏసీబీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఏఎస్పీతో అక్రమ సంబంధం పెట్టుకుని, నిన్న ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయిన కల్వకుర్తి సీఐ మల్లికార్జునరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఏఎస్పీ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం, మల్లికార్జునరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అంతకుముందు ఏఎస్పీ స్టేట్ మెంట్ ను కూడా కేపీహెచ్బీ పోలీసులు రికార్డు చేశారు. ఆమె తన ఇష్టపూర్వకంగానే సీఐతో ఉన్నట్టు తెలియజేసిందని పోలీసు వర్గాల సమాచారం. కాగా, ఆమెను తాను వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని, విడాకులు వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటామని ఉన్నతాధికారుల ముందు మల్లికార్జునరెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది.మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -