18 సంవత్సరాల తర్వాత అడోబ్ సీఈఓ పదవి నుంచి శంతను నారాయణ్ తప్పుకోనున్నట్లు అడోబ్ ప్రకటించింది. ఇది ఎలాంటి వీడ్కోలు కాదు. ఇది గత ప్రయాణాన్ని ఒకసారి తిరిగి ఆలోచించుకునే సమయం మాత్రమేనని వెల్లడించారు నారాయణ్. అలాగే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ..సృజనాత్మకతకు కొత్త యుగం ప్రారంభమవుతోంది. AI, కొత్త వర్క్‌ఫ్లోలు, కొత్త భావవ్యక్తీకరణ రూపాలు ఈ యుగాన్ని నిర్మిస్తున్నాయి అని చెప్పారు.
ఈ ప్రకటన అనంతరం సత్య నాదేళ్ల ఆయనను ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశం పంపించారు. అడోబ్‌లో మీ అద్భుతమైన ప్రయాణానికి అభినందనలు శాంతను. మీరు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటిగా అడోబ్‌ను తీర్చిదిద్దారు. క్రియేటర్లు, వ్యాపారవేత్తలు, బ్రాండ్లకు కొత్త అవకాశాలను అందించారు. అంతేకాకుండా, నాదెళ్ల మాట్లాడుతూ శాంతను నారాయణ్ తనకు కేవలం పరిశ్రమలో సహచరుడే కాకుండా మెంటర్‌లా కూడా మార్గనిర్దేశం చేసిన వ్యక్తి అని చెప్పారు. మీ స్నేహం, మార్గదర్శకత్వం మరియు అడోబ్‌తో పాటు టెక్నాలజీ రంగానికి చేసిన సేవలకు నేను కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు.
శాంతను నారాయణ్ డిసెంబర్ 2007 నుంచి అడోబ్ సీఈఓగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అడోబ్ భవిష్యత్తు వ్యూహంపై పెట్టుబడిదారులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఉదాహరణకు, గూగుల్ రూపొందించిన నానో బనాన వంటి AI ఇమేజ్ జనరేషన్ టూల్స్ వల్ల, వినియోగదారులు ఇప్పుడు అడోబ్ ఫోటోషాప్ వంటి యాప్‌లు లేకుండానే చిత్రాలను సవరించగలుగుతున్నారు.అయితే అడోబ్ కూడా Firefly అనే AI ఆధారిత ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది. ఈ AI ఉత్పత్తులకు వినియోగదారుల స్పందన వేగంగా పెరుగుతోందని కంపెనీ తెలిపింది.
Also Read:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్
శాంతను నారాయణ్ నాయకత్వంలో అడోబ్ భారీగా విస్తరించింది.ఉద్యోగుల సంఖ్య: సుమారు 3,000 నుంచి 30,000 పైగా, ఆదాయం: $1 బిలియన్ కంటే తక్కువ నుంచి $25 బిలియన్ కంపెనీగా ఆవిర్భవించింది.
1998లో అడోబ్‌లో వైస్ ప్రెసిడెంట్ & జనరల్ మేనేజర్ గా చేరారు.2005లో ప్రెసిడెంట్ మరియు COO గా పదోన్నతి,2007లో CEO అయ్యారు.2017లో చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ గా నియమితులయ్యారు.

