‘మేజర్’ మూవీ నుండి లేటెస్ట్‌ అప్‌డేట్‌..

93
- Advertisement -

నటుడు అడివి శేష్ మొదటి పాన్ ఇండియా చిత్రం మేజర్ మే 27న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో వేసవి కానుక‌గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడింది. మలయాళంలో కూడా విడుదల కానుంది. మార్చి 15న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి. 26/11 సంఘ‌ట‌న హీరోగా నిలిచిన మేజ‌ర్‌ 45వ జ‌యంతి సందర్భంగా, మేజర్ బృందం అతని జీవితంపై హృదయపూర్వకమైన నివాళిని వీడియో రూపంలో తెలియ‌జేస్తుంది.

ఈ వీడియో కేవలం మేజర్ జీవితంలోని వివిధ దశలను చూపడమే కాకుండా, ఆ పాత్రను అడివి శేష్‌తో చిత్రీకరించిన మరపురాని సంఘటనలను కూడా చూపుతుంది. ఇందులో మేజర్‌కి తన తల్లితో ఉన్న ఆప్యాయత, సోదరితో అతని బంధం, స్నేహితులతో గ‌డిపిన అత్యుత్తమ క్షణాలు, శిక్షణా రోజులు, చివరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో అధికారిగా అతని అనుభవాలను వివరిస్తుంది. చివ‌రివ‌ర‌కు ఇమేజెస్‌లో మేజర్‌లోనూ, శేష్‌లోనూ మనకు పెద్దగా తేడాలు కనిపించవు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌యంతి సందర్భంగా ఈ వీడియో ఒక సంపూర్ణ గుర్తింపుగా నిలుస్తుంది. ఈ చిత్ర టీజర్‌పై భారీ అంచనాలు నెలకొనగా, మొదటి పాట హృదయమా సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.

బహుభాషా చిత్రంగా రూపొందిన మేజర్ చిత్రంలో మేజర్ సందీప్ బాల్యం, యుక్తవయస్సు, సైన్యంలో సంవత్సరాల నుండి వున్న‌ప్ప‌టినుంచీ అతను మరణించిన ముంబై దాడి విషాద సంఘటనల వరకు అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను స్పృశిస్తుంది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రముఖ తారాగణం, మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్‌, A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది.

- Advertisement -