అదరగొడుతున్న ‘ఆదిత్య వర్మ’ టీజర్..

809
Adithya Varma Official Teaser
- Advertisement -

తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘ఆదిత్య వర్మ’. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన గిరీశాయా ‘ఆదిత్య వర్మ’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.

తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన ఆదిత్యవర్మ యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా దాదాపు ఒరిజినల్‌ లానే తెరకెక్కించారు. సన్నివేశాలు హీరో యాటిట్యూడ్‌ లాంటివి యాజిటీజ్‌గా దించేశారు. టీజర్‌లో లుక్స్‌, యాక్టింగ్‌ పరంగా ధృవ్‌ ఆకట్టుకున్నాడు. ముందుగా ఈ సినిమాను సీనియర్‌ దర్శకుడు బాలా తెరకెక్కించగా అవుట్‌పుట్‌ నచ్చకపోవటంతో చిత్రయూనిట్ గిరీశయ్య దర్శకత్వంలో పూర్తి సినిమాను తిరిగి రూపొందించారు. ధృవ్‌ సరసన బనిటా సంధు హీరోయిన్‌గా నటిస్తుంది.

- Advertisement -