పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎస్పీ ప్రవీణ్ కుమార్

101
Green
- Advertisement -

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., గారు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయ అవరణలో ఎస్పీ గారు, పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

ఎంపీ సంతోష్ కుమార్ కొనసాగిస్తున్న గ్రీన్ చాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి గారు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., గారు ఈరోజు మొక్కలు నాటారు. అనంతరం DCP మాదాపూర్ శ్రీమతి.కే.శిల్పవల్లి ఐపిఎస్., మేడం, డిప్యూటీ డైరెక్టర్ TSPA శ్రీ.రాహుల గిరిధర్ ఐపిఎస్., ఎఎస్పీ భైంసా కిరణ్ ఖరే ఐపిఎస్., గార్లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మొక్కలు నాటి హరితహారా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా జిల్లా ఎస్పీ గారు కోరారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రాణాధారమైన మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా సకాలంలో రుతుపవనాలు రావడమే కాకుండా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు హరితహారం లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ద్వారా భావితరాలకు కాలుష్య రహిత మైన వాతావరణం అందించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్) శ్రీ.KRK,ప్రసాద్ రావు, ఎఎస్పీ భైంసా కిరం ఖరే ఐపిఎస్., డిఎస్పీ నిర్మల్ జీవన్ రెడ్డి, ఎఓ వెంకట శేఖర్, ఎస్బి ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్ఐలు రమేష్, రామకృష్ణ, యంటిఓ వినోద్, డిపిఓ సిబ్బంది, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, హోంగార్డ్స్ అధికారులు మొదలగువారు పాల్గొని మొక్కలు నాటారు.

- Advertisement -