‘అదుగో’ టీజర్‌ను చూడండీ..

261
Adhugo Movie Teaser
- Advertisement -

టాలీవుడ్‌ నటుడు,దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజాగా చిత్రం ‘అదుగో’ ఈ మూవీలో ‘పందిపిల్ల’ ప్రధాన పాత్రలో కనబడనుంది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా నుంచి ఇటీవల ఫ‌స్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుండి టీజర్‌ను రిలీజ్ చేశారు. బంటి (పంది పిల్ల) చెప్పినట్టు చేయడం .. డాన్స్ కూడా చేసేయడం చూపించారు. ఈ టీజర్ చిన్నపిల్లలను ఆకట్టుకునేలానే వుంది. కేవలం పంది పిల్లను మాత్రమే చూపిస్తూ టీజర్‌ను కట్ చేశారు. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

Adhugo Movie Teaser

సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లో ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తుండ‌గా.. ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యాన‌ర్‌లో ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదుగో అన్ని భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల అవుతుండ‌టం విశేషం. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -