అధికమాసం అంటే ఏంటో తెలుసా?

72
- Advertisement -

2023 సంవత్సరంలో అధిక మాసం రానుందని పలువురు పండితులు తెలుపుతున్నారు. హిందూ పంచాంగం ప్రకారం 13నెలలు ఉండనున్నాయన్నారు. ఈమేరకు శ్రావణ మాసం రెండు నెలల పాటు కొనసాగనుంది. ఇలాంటి సందర్భం 19యేళ్లకొకసారి వస్తుంది. కేలండర్ ప్రకారం అయితే జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణం కొనసాగుతుంది. దీనిని రెండు రకాలుగా రోజులను లెక్కించనున్నారు.

సౌరమానం, చంద్రమానం పంచాగాల ప్రకారం లెక్కించనున్నారు. వీటి మధ్య వ్యత్యాసం గల రోజులను అధికమాసం అంటారు. సౌరమాన ప్రకారం సంవత్సరం కాలపరిమితి 365రోజులు 6గంటలుగా ఉంటుంది. చంద్రమానం ప్రకారం సంవత్సరానికి 354రోజులే ఉంటాయి. ఈ తేడాను అధికమాసం రూపంలో సరిచేస్తుంటారు. ఈ అధికమాసం కారణంగా శ్రావణమాసంలో అధికంగా పెళ్లిళ్లు ఉంటాయని అంటున్నారు.

అధిక మాసము శూన్యమాసమైనందున శుభకార్యాలు ఆచరించడానికి నిషిద్ధము. అధికమాసంలో వివాహము, ఉపనయనము, గర్భాదానం, గృహారంభం, గృహప్రవేశం వంటివి నిషేధించారు. అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలను ఆచరించకూడదు. పితృ కార్యాలను కూడా అధికమాసాన్ని వదిలేసి నిజమాసంలోనే ఆచరించాలి.

Also Read:ఆ రెండు పార్టీలకు ఎన్డీయేనే దిక్కా?

ఈ అధికమాసంలో దైవారాధనలు, వ్రతాలు, పితృ ఆరాధన , అధికమాస పూజ, దానధర్మాలు వంటివి ఆచరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.పురాణాల ప్రకారం అధిక మాసానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన విశేషముంది. మహావిష్ణువుకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అధిక మాసము. మహావిష్ణువు అధికమాసానికి పురుషోత్తమ మాసమని పేరు ఇచ్చినట్లుగా చెప్పబడింది.

పూర్వం ఇంద్రుడు అధిక మాస వ్రతాన్ని ఆచరించి ఇంద్ర పదవిని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి స్వయముగా అధికమాస మహిమ గురించి మహావిష్ణువును అడుగగా మహావిష్ణువు ఈ అధిక మాసమైనటువంటి పురుషోత్తమ మాసములో ఎవరైతే పుణ్య నదీ స్నానాలు జప హోమాలు, దానాలు వంటివి ఆచరిస్తారో వారికి మామూలు మాసంలో వచ్చేటటువంటి ఫలితాలు కన్నా అధిక రెట్ల ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇదియే కాకుండా ఇలాంటి అధిక మాసంలో గనుక పుణ్యకర్మలు ఆచరించకపోతే వారి జీవితంలో కష్టనష్టములు ఎదురవుతాయని పెద్దలు చెబుతారు. అధికమాసంలో శుక్ల పక్షమునందు గాని కృష్ణపక్షమునందు గాని అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజున కనీసము ఈ పుణ్యకార్యాలు ఆచరించినట్లు అయితే వారికి అధిక మాస పుణ్య ఫలము లభిస్తుందని విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవికి చెప్పినట్లుగా పురాణాలు తెలిపాయి.

Also Read:కొబ్బరి నీళ్ళు తాగుతున్నారా.. ఇవి తెలుసా!

- Advertisement -