నేను సెక్సీగా కనిపించగలను..

364
Adah Sharma Western and Traditional Look
- Advertisement -

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో ఆదాశర్మ ఒకరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో అవకాశం వచ్చినప్పటికీ.. అవి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ, అనేక చిత్రాల్లో సైడ్ హీరోయిన్‌గా కనిపిస్తోంది. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మడు అదృష్టం ఇదే విధంగా ఉంది. అయితే అటు బాలీవుడ్‌లో ఫేమస్ కాలేక ఇటు సౌత్ కమర్షియల్ హీరోయిన్ లా సక్సెస్ కాలేక మధ్యలో ఉండిపోవలిసి వస్తోంది ఈ అమ్మడు. అందం ఉన్న పెద్దగా అవకాశాలు రావడం లేదు.

Adah Sharma Western and Traditional Look

అల్లు అర్జున్ హీరోగా నటించిన s/o సత్యమూర్తి లో ఒక సాదా అమ్మాయిగా కనిపించిన ఆదా శర్మ ఆ తరువాత అతి కష్టం మీద అడివి శేష్ నటించిన క్షణం సినిమాలో ఒక్కసారి దర్శనం ఇచ్చింది. మళ్ళీ ఆ తరువాత తెలుగు తెర పై కనిపించే అవకాశం రాలేదు. ఆ మధ్య ఏదో ఒక మలయాళం సినిమా కోసం ఆ ప్రాంతపు మల్ల యుద్దం నేర్చుకొని వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సినిమా అవకాశాలు కోసం తనకు తానే ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టింది. నేను సాంప్రదాయ అమ్మాయిలా కనిపించగలను సెక్సీ అమ్మాయిగా కనిపించగలను అని చెబుతూ ఒక ఫోటో ను కూడా పోస్ట్ చేసింది తన సోషల్ మీడియా పేజ్ లో. రెడ్ డ్రెస్స్ లో హాట్ గా కనిపిస్తూ చీర కట్టులో ముద్దుగా కనిపిస్తున్న ఒక ఫోటోను షేర్ చేసింది. నా నుండి మీకు ఏది కావాలనిపిస్తే అది తీసుకోవచ్చు నాలో రెండు రకాలు ఉన్నాయి అని చెబుతోంది.

Adah Sharma Western and Traditional Look

పుట్టింది పెరిగింది ముంబాయి అయినందువలన నాకు మెట్రో లుక్ బాగా సెట్ అవుతుంది అలాగే నాన్న సౌత్ ఇండియన్ కావడం వలన నాలో సౌత్ బాడీ టైప్ కూడా ఉందని ఆదా శర్మా అభిప్రాయపడింది. ఇలా ఎలా ప్రచారం చేసినా ఇప్పుడు ఉన్న సౌత్ హీరోయిన్ల పోటీ మధ్య ఈ హీరోయిన్ కు అవకాశం రావడం కొంచెం కష్టమే.

- Advertisement -