చీర కట్టులో ఆదా ఫిట్‎నెస్ కసరత్తులు చూశారా..?

334
Adah-Sharma--t_5164.gif
- Advertisement -

‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ చాలెంజ్’‎ని కేంద్ర మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫిట్‎నెస్ చాలెంజ్‎లో అందాల బ్యూటీ ఆదా శర్మ వినూత్నంగా పాల్గొన్నారు. భారతీయ  చీర కట్టులో యోగా చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

Adah-Sharma

చీరకట్టులో యోగా విన్యాసాలు, కర్రలతో కసరత్తులు చేసింది. ఈ కర్రల విన్యాసాన్ని మహారాష్ట్రలోని అఖాడాలో చూశానని, ఈ కర్రలతో విన్యాసాలు చేయడం వలన కండరాలు బలంగా మారుతాయని చెప్పుకొచ్చింది. మన బాడీని ఫిట్‎గా ఉంచుకోవడం అంటే మనసును అదుపులో పెట్టుకోవడమేనని చెప్పింది. ఇక నా మాదిరిగా చీరకట్టులో ఇతర హీరోయిన్లు ప్రయత్రించవద్దని అన్నారు. నేను భారతీయ స్త్రీని కనుక ఈ విన్యాసాలు చేయగలిగాను, ఇతర హీరోయిన్లు తనను కాఫీ కొట్టవద్దని చమత్కరించింది.

ఇక అమ్మడు చీరకట్టులో చేసిన విన్యాసాలకు కుర్రకారులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‎చల్ చేస్తోంది. మరోవైపు టాలీవుడ్‎లోనూ జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అఖిల్, నాగచైతన్యలు ఇప్పటికే ఈ ఛాలెంజ్‎లో పాల్గొన్న విషయం తెలిసిందే.

- Advertisement -