బీఆర్ఎస్ ఎమ్మేల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెలకాంతం, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ ఛైర్మన్ ఒరుగంటి వెంకటేశం గౌడ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ విధానాలు ఎండగట్టారు. ఈసందర్భంగా గజ్జెల కాంతం మాట్లాడుతూ… తెలంగాణ ఆడబిడ్డ అయిన కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం అక్రమమన్నారు. దేశవ్యాప్తంగా పదిలక్షల కోట్ల సంపదను దోచుకున్న అదానీపై ఎటువంటి కేసులు గానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టడంలేదని మండిపడ్డారు.
అదానీ లాంటి అక్రమార్కులకు బీజేపీ ప్రభుత్వం కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. దీన్ని ప్రజాస్వామ్య ఖూనీ అంటారని కేవలం బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈడీ సీబీఐ ఐటీ దాడులు ఎందుకు చేయట్లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. గత డెబ్బై యేళ్లుగా ఉత్తార భారత నాయకులు కేంద్రంలో అధికార పెత్తనం చెలాయిస్తున్నారని…కానీ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తే అడ్డుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై దర్యాప్తు సంస్థలతో దాడులు నిర్వహించి భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని అన్నారు.
బీజేపీ చేసిన అక్రమాలు, అవినీతిని బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నందున కారణంగా… జాతీయ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇవే ఈడీ సీబీఐ ఐటీలతో దాడులు నిర్వహించి బీజేపీని జైలుకు పంపించడం ఖాయమన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్ని కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి…