అల్లు అర్జున్ కి చుక్కలు చూపిస్తున్న పవన్ ఫ్యాన్స్‌…..

238
- Advertisement -

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా టీజర్‌ మహాశివరాత్రి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా టీజర్‌లో అల్లు అర్జున్‌ బ్రాహ్మణుడి గెటప్‌లో సందడి చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే….
Actual Reasons Behind DJ Teaser Dislikes
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఎప్పుడైతే ”చెప్పను బ్రదర్” అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులపై మొదలుపెట్టిన పోరు.. ఇప్పుడు డీజే టీజర్ కు డిజ్ లైక్ లలో రికార్డ్ క్రియేట్ చేసే దాకా వెళ్లింది. పవన్‌ అభిమానులు కావాలనే డీజే టీజర్‌కు డిస్లయిక్స్‌ కొట్టేస్తున్నారు. బన్నీ టీజర్ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ వచ్చిన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా సినిమా టీజర్ డిస్లయిక్స్ లో రికార్డు సృష్టించే స్థాయికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం డీజే టీజర్‌కు లైక్స్ ఎన్ని ఉన్నాయో డిస్లయిక్స్ కూడా అన్ని కనిపిస్తున్నాయి. అయితే ఈటీజర్‌ చూసిన ఎవరు కూడా డిస్లయిక్‌ మాత్రం కొట్టరు. ఎవరో ఒక్కరిద్దరు కొడతారు తప్ప ఇలా రికార్డ్‌ క్రియేట్‌ చేసే రేంజ్‌లో మాత్రం డిజ్‌లక్స్‌ చేయారు. టాలీవుడ్ హీరోలు నటించిన ఏ సినిమాకు కూడా ఇన్ని డిస్‌లైక్స్‌ రాలేదు….కేవలం బన్ని డీజెకి మాత్రమే డిస్‌లైక్స్‌ వస్తున్నాయి.

మరోవైపు టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉందని.. అందరికీ థ్యాంక్స్.. అంటూ అల్లు అర్జున్ తన ట్వీట్టర్‌ ద్వారా ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు. గురువారం రిలీజ్ అయిన డీజే ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 50 గంటల్లో ఈ టీజర్ మిలియన్ మార్క్ దాటి బన్నీ కెరీర్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది.
Actual Reasons Behind DJ Teaser Dislikes
దువ్వాడ జగన్నాథమ్ టీజర్ మరిన్ని రికార్డుల్‌ సృష్టిస్తుందని బన్ని ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. డిస్‌లైక్స్‌ కొట్టినంత మాత్రాన బన్ని ఇమేజ్‌ను ఎవరు డ్యమేజ్‌ చేయాలేరని సోషల్ మీడియాద్వారా బన్ని ఫ్యాన్స్‌ పవన్‌ ఫ్యాన్స్‌పై దుమ్మేత్తిపొస్తున్నారు.

బ్రాహ్మణుడి గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించిన ఈ టీజర్‌లో హీరోయిన్ పూజాహెగ్డే ముద్దుపెట్టుకున్న సీన్‌ కనిపిస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ‘ఇలా.. ఇలా ముద్దులు పెట్టేసి సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని’ అంటూ చెప్పిన డైలాగ్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుటుంది. ఏదేమైనప్పటీకి  ప‌వ‌న్ ఫ్యాన్స్ దెబ్బ‌కు బన్నీ డీజే టీజ‌ర్  చెత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -