బాలీవుడ్‌ నటిపై లైంగిక వేధింపులు..

215
- Advertisement -

‘దంగల్’ నటి జైరా వాసిమ్ కు విమానంలో దారుణమైన అనుభవం ఎదురైంది. ఆమె తన ఆవేదనను ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ వివరాలను తెలిపారు. తాను ఎయిర్ విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తుండగా.. తన వెనుక కూర్చున్న వ్యక్తి లైంగికంగా వేధించాడని జైరా వాసిమ్ కన్నీరు పెడుతూ తెలిపారు. దీనికి తాను అభ్యంతరం తెలిపానన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం వల్ల తన కాలును అక్కడ పెట్టానని అతను చెప్పాడని తెలిపారు.

Actress Zaira Wasim Allegedly Molested On Delhi-Mumbai Flight

అనంతరం తాను నిద్రపోతున్న సమయంలో తన మెడపై ఆ వ్యక్తి తన కాలితో తడిమాడని, ఆ విషయాన్ని తాను గ్రహించిన తర్వాత, ఆ దృశ్యాన్ని రికార్డు చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. అయితే విమానంలో కాంతి తక్కువగా ఉన్నందువల్ల ఆ భయానక దృశ్యాలను రికార్డు చేయలేకపోయానన్నారు. కానీ కొంత వరకు ఆ దుర్మార్గుడి దుశ్చర్యను రికార్డు చేయగలిగినట్లు తెలిపారు. తన మెడ, భుజంపై ఆ వ్యక్తి తన కాలితో తడమటం దాదాపు 5 నుంచి 10 నిమిషాలపాటు కొనసాగినట్లు తెలిపారు.

ఈ విధంగా జరిగి ఉండవలసినది కాదని జైరా తీవ్ర మనోవేదనతో చెప్పారు. తాను తీవ్రంగా కలత చెందినట్లు పేర్కొన్నారు. మహిళలను పరిరక్షించేది ఈ విధంగానేనా? అని నిలదీశారు. ఎవరినీ ఈ విధంగా చేయకూడదన్నారు. ఇది చాలా దారుణమని, భయానకమని అన్నారు. విస్తారా విమాన సిబ్బంది కూడా తనకు సహాయం చేయడంలో విఫలమయ్యారని జైరా ఆరోపించారు.

https://twitter.com/SwamiGeetika/status/939699556014424064

- Advertisement -