ఆ హీరోయిన్ని ఎలా తప్పు పట్టగలం?

13
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లేకపోతే.. అవమానాలను చాలా సహజంగానే తీసుకోవాలి. ఒక్కోసారి మరెవరో ఫెయిల్యూర్ ను పట్టుకొచ్చి హీరోయిన్ల మీద రుద్దుతారు. అయినా, హీరోయిన్లు నోరు ఎత్తకూడదు. ఎదురు ప్రశ్నలు వేసినా, ఎదురు తిరిగినా ఆమె కెరీర్ ను అక్కడితో తొక్కేస్తారు. మొదట్లో హీరోయిన్ తాప్సీ పన్నూ తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ, ఎందుకో.. తాప్సీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. పైగా తాప్సీ తేడా హీరోయిన్ అంటూ ప్రచారం కూడా చేశారు. అందుకే తాప్సీకి సౌత్ సినీ ఇండస్ట్రీ అంటే.. కోపం.

ఆ కోపంతోనే తాప్సీ సౌత్ సినిమా పరిశ్రమ పై ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. టాలీవుడ్ సినిమాలు చేస్తున్న సమయంలో తనకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయని… ఆ సమయంలో తనపై చాలా విమర్శలు వచ్చాయని తాజాగా తాప్సీ చెప్పింది. తనను ఐరన్ లెగ్ అన్నారని మండిపడింది. సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్‌పై నిందలు ఎందుకు వేస్తారని సౌత్ ఫిల్మ్ మేకర్స్ ను తాప్సీ ప్రశ్నించింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కొన్ని సన్నివేశాలు, పాటలకే పరిమితమవుతారని… అలాంటప్పుడు సినిమా ఫెయిల్ అవడానికి వారెలా కారణమవుతారని తాప్సీ అడిగింది.

Also Read:హీరో పై హీరోయిన్ అసంతృప్తి

తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది కదా. మరి అలాంటప్పుడు ఆమెను ఎలా తప్పు పట్టగలం?, పైగా తాప్సీ ఇంకా చాలా విషయాలే చెప్పింది. ఇతర భాషల హీరోయిన్లకు ఇచ్చే గౌరవం సౌత్ లో సెటిల్ అయిన హీరోయిన్లకు ఇవ్వడం లేదని.. కొందరు సౌత్ ఫిల్మ్ మేకర్స్ తనకు చెప్పకుండానే తనను వారి సినిమాల్లో నుంచి తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయని తాప్సీ చెప్పుకొచ్చింది. అందుకే తనకు సౌత్ ఇండస్ట్రీ అంటే.. గౌరవం లేదని స్పష్టం చేసింది.

Also Read:‘భోళాశంకర్’ సెన్సార్ రివ్యూ ఇదే

- Advertisement -