టాలీవుడులో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు పరిశ్రమలో అమ్మాయిలు వేధింపులకు గురవుతున్నారని ఆమె పోరాటం చేస్తుంది. శ్రీరెడ్డి ఈరోజు ఓ సంచనల నిర్ణయం తీసుకుంది. నా పేరులో రెడ్డి అనే పదాన్ని మోయలేకపోతున్న, చాలా బరువుగా ఉంది. నా పేరు నుంచి ఆ పదాన్ని తీసేస్తున్న.. ఇకపై నాపేరు శ్రీరెడ్డి కాదని శ్రీశక్తి అని తెలిపింది. నా గురించి మీడియా వాళ్లు రాసేటప్పుడు, చదివేటప్పుడు గానీ శ్రీశక్తి అనే చదవాలి, రాయాలి అని ఆమె పేర్కొంది.
అయితే నిర్మాత దిల్ రాజు ప్రభావం నుంచి ఎప్పుడయితే థియేటర్లు బయటకు వస్తాయో అప్పటి వరకు నేను శ్రీశక్తిగానే ఉంటాను. కొందిమంది పెద్ద మనుషుల వద్ద మెజారిటీ థియేటర్లు ఉండిపోయాయి. వారందరి చేతుల నుంచి థియేటర్లు బయటపడాలంది. నేను తలపెట్టిన ఉద్యమం ఇంత పెద్దదవుతుందని అనుకోలేదని కొంత మంది అమ్మాయిలు వచ్చి వాళ్ల బాధలను చెప్పుకుంటున్నారు అంది. ఇకపై ఓయూ విద్యార్థులను కలుపుకుని వెళ్తాం. ఏ ఒక్క ఆడపిల్లకు అన్యాయం జరిగినా వాళ్లకు న్యాయం జరిగేలా చేస్తాం అని ఆమె పేర్కొన్నారు.