రేటు పెంచేసిన శ్రీలిల!

50
- Advertisement -

టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా వెలిగిపోతోంది శ్రీలిల. ఇప్పుడు కుర్ర హీరోల దగ్గరి నుండి అగ్ర హీరోల వరకు అంతా శ్రీలిలనే ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టుగా కెరీర్ గాఢిలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలనే క్లారిటీకి వచ్చేసింది. అందుకు ఇప్పటివరకు ఒక్కో సినిమాకు కోటి తీసుకుంటున్న శ్రీలిల దానిని డబుల్ చేసేసింది. అంటే ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.2 కోట్లు తీసుకుంటుందట.

పెళ్లి సందD చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది శ్రీలిల.అనంతరం 2 న్నడలో బై టూ లవ్, జేమ్స్ చిత్రాలతో ,రవితేజతో ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి హీరోలతో నటిస్తోంది.

Also Read:హిడింబ..థ్రిల్ మూవీ: అనిల్ కన్నెగంటి

అలాగే మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28లో కూడా అవకాశం కొట్టేసింది. మొత్తంగా శ్రీలీల చేతిలో 7 భారీ చిత్రాలు ఉన్నాయి.

Also Read:Project K:దీపికా లుక్ వైరల్

- Advertisement -