‘శ్రీలీల’ గ్లామర్ వెనుక సీక్రెట్స్ ఇవే !

74
- Advertisement -

పాలమీగడ మీద చిక్కని నురుగు లాంటి మేని ఛాయ ఉన్న ‘శ్రీలీల’ అందం వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలని ఉందా ? అసలు, తన అందం కాపాడుకోవడం కోసం ‘శ్రీలీల’ చేసే పనులు తెలిస్తే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మరి, తన చంద్రకాంతి లాంటి ముఖాన్ని కాపాడుకోవాలంటే ఆ మాత్రం చేయాల్సిందే అంటుంది శ్రీలీల. ఇంతకీ, శ్రీలీల అందం వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్స్, ఆమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఏమిటో చూద్దాం.

‘శ్రీలీల’ పాటించే బ్యూటీ సీక్రెట్స్ :

1. శ్రీలీల డైట్ :
‘శ్రీలీల’ వెజిటేరియన్ డైట్ ను ఎక్కువగా ఫాలో అవుతుంది. అలాగే ‘శ్రీలీల’కి పెరుగు అంటే చాలా ఇష్టం, తన భోజనంలో ఎప్పుడూ పెరుగు ఉండేలా చూసుకుంటుంది. పెరుగు తన శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతుందని శ్రీలీల అభిప్రాయం. నిజానికి ‘శ్రీలీల’కి చిన్నతనం నుంచీ వేపుళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. కానీ, తన అందమైన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడం వాటికి చాలా దూరం ఉంటుంది.

2. శ్రీలీల వాటర్ రూపంలో తాగేవి ఇవే :
‘శ్రీలీల’ తరచూ మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు తీసుకుంటుంది. వీటి వల్ల తన చర్మానికి తగినంత తేమ అందుతుందని, అప్పుడు తన స్కిన్ నిత్యం తాజాగా కనిపిస్తుందని శ్రీలీల చెబుతుంది. ఇక రోజూ పొద్దున లేవగానే ‘శ్రీలీల’ ముందు ఓ గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులు తిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగుతుంది.

3. శ్రీలీల వాటికీ దూరం.
స్వీట్స్ ను అమితంగా ఇష్టపడే ‘శ్రీలీల’ వాటికి మాత్రం చాలా దూరంగా ఉంటుంది. పంచదారతో చేసిన పదార్థాలకు ఈ పంచదార బొమ్మ మరి ఎలా దూరం ఉండగలుగుతుందో ! అలాగే, ‘శ్రీలీల’ ప్రమాదకర రసాయనాలున్న కాస్మెటిక్ ఉత్పత్తులను అస్సలు ఉపయోగించదు.

Also Read: Directors Day:దాసరి బర్త్ డే

4. శ్రీలీల మేకప్:
‘శ్రీలీల’ షూటింగ్ లేకపోతే అస్సలు మేకప్ జోలికే వెళ్ళదు. పైగా హాని కలిగించే రసాయనాలతో ఉన్న మేకప్ ను, అలాగే రకరకాల హెయిర్ స్టైల్స్ కాకుండా ఎప్పుడూ సింపుల్ గా ఉండటానికే ‘శ్రీలీల’ ఇష్టపడుతుంది. ఐతే.. ‘శ్రీలీల’ షూటింగ్ ఉన్నా లేకపోయినా డైలీ లిప్ స్టిక్ మాత్రం వాడుతుంది. ఎస్టీ లాడర్ లిప్ స్టిక్ బ్రాండ్ అంటే.. ‘శ్రీలీల’కి అమితమైన ఇష్టం.

Also Read: ఆ నటుడు ఆరోగ్యం మళ్లీ సీరియస్

5. శ్రీలీల జిమ్ :
‘శ్రీలీల’ ప్రతీ రోజూ జిమ్ లో కనీసం గంట సేపైనా గడుపుతుంది. పైగా నిపుణుడైన ట్రైనర్ పర్యవేక్షణలో తన ఉదర భాగాన్ని శ్రమ కలిగించే ఆబ్ క్రంచెస్, కార్డియో, వెయిట్స్ మరియు ఫ్రీ హాండ్ వంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తోంది. అందుకే ‘శ్రీలీల’ ఉదర భాగం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.

- Advertisement -