డాక్టర్ ప్లస్ యాక్టర్

541
- Advertisement -

చాలా మంది యాక్టర్స్ సరదాగా తాము డాక్టర్ అవుదామనుకొని అనుకోకుండా యాక్టర్ అయ్యామని చెప్పుకుంటుంటారు. కానీ ఇండస్ట్రీలో యాక్టర్స్ ప్లస్ డాక్టర్స్ గా ఉన్న వాళ్ళు చాలా అరుదు. ఈ లిస్టులో తాజాగా యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా చేరబోతోంది. అవును శ్రీలీల ప్రస్తుతం డాక్టర్ అవ్వడం కోసం ఏమ్బీబియస్ చదువుతుంది. ఇటివలే వైష్ణవ్ తేజ్ సినిమా షూటింగ్ లో పాల్గొని అలాగే ధమాకా ప్రమోషన్స్ లో పార్టిసిపెంట్ చేసి ముంబై కి జంప్ అయ్యింది.

ప్రస్తుతం ముంబై లో ఆమె ఎమ్బిబియస్ ఎగ్జాం రాస్తుంది. ఈ కుర్ర హీరోయిన్ చేతిలో అరడజను పైనే సినిమాలున్నాయి. అందులో మహేష్ బాబు -త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది. అలాగే నితిన్ , నవీన్ పోలిశెట్టి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. కన్నడలో రెండు తెలుగులో నాలుగు సినిమాలతో వచ్చే ఏడాది శ్రీలీల డైరీ ఫుల్ అయింది. ఇక సినిమాల ఆఫర్స్ టైంలో శ్రీలీల పేరెంట్స్ ఆమెను రెండూ బ్యాలెన్స్ చేయగలవా ? అని అడిగితే రెండు చూసుకోగలను అని సినిమాల్లోకి అడుగుపెట్టేసింది ఈ బ్యూటీ. అన్నట్టుగానే రెండో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది.

శ్రీలీల అటు డాక్టర్ చదువుతూ ఇటు యాక్టర్ గా బిజీగా ఉంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తుంది. మరి డాక్టర్ అయ్యేంత వరకూ ఆమె సినిమాల్లో నటిస్తుందా ? లేక డాక్టర్ వృత్తి పక్కన పెట్టేసి యాక్టర్ గానే కంటిన్యూ అవుతుందా ? చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -