సోనూ సాయం..మరో ప్రాణం నిలబడింది

233
sonu
- Advertisement -

సాయానికి మారుపేరుగా నిలిచారు సోనూ సూద్. సమాజంలోని పేదలకు,ఆపదలో ఉన్నావారిని ఆదుకుంటున్న సోనూ తాజాగా మరో ప్రాణాన్ని నిలబెట్టారు. ఓ చిన్నారునికి గుండె చికిత్స చేయించి దేవుడిగా నిలిచారు.

ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న సోనూ…బిగ్ డే… ఇటీవలి కాలంలో మాకు అత్యంత క్లిష్టమైన కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స ఒకటి సూపర్ సక్సెస్. సర్వశక్తిమంతుడికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స చేయించుకున్న బాలుడి కుటుంబ సభ్యులు కూడా సోనూసూద్ కు ధనువాదాలు తెలిపారు.

ధన్యవాదాలు సోనూసూద్. మీ మద్దతుతో శుభమ్ కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు శుభమ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మీ సహాయానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -