పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్

553
Shweta
- Advertisement -

కొత్తబంగారులోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్యరయ్యారు హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్. ఆసినిమా మంచి విజయం సాధించిన ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే సంవత్సరం క్రితం రోహిత్ మిట్టల్ అనే వ్యాపార వేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్వేత. పెళ్లి అయి ఏడాది గడవక ముందే విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పింది. తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని తాను తన భర్త రోహిత్ మిట్టల్ కొన్ని రోజుల క్రితమే నిర్ణయించుకున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని నెలలుగా తమ మధ్య విభేదాల కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్టు స్పష్టం చేశారు.

swetha basu

ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. రోహిత్ నేను పరస్పరం ఈనిర్ణయానికి వచ్చాం.. కొన్ని నెలలుగా మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఈనిర్ణయం తీసుకున్నాం. ఒక పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదవనంత మాత్రాన అది చెడ్డది కాదు. కొన్ని విషయాలు అసంపూర్ణంగానే ఉండటం మంచిది. ఎప్పుడూ నాకు స్ఫూర్తిగా ఉంటూ.. ఎన్నో మంచి జ్ఞాపకాలు ఇచ్చినందుకు థ్యాంక్యూ రోహిత్‌ అంటూ పోస్టు పెట్టారు. చెరిగిపోని జ్ఞాపకాలను మిగిల్చినందుకు, నాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు రోహిత్. నీ జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటూ నీ చీర్‌లీడర్’ అని ట్వీచ్ చేసింది శ్వేత బసుప్రసాద్. కాగా గతేడాది డిసెంబర్ 13న వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది.

- Advertisement -