బాబోయ్.. కుర్ర హీరోతో రొమాన్స్

50
- Advertisement -

ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ శోభన అంటే నేటికీ క్రేజ్ ఉంది. ఆమె భరతనాట్యానికి ఎందరో అభిమానులు ఉన్నారు. ఇలాంటి శోభన ఇప్పుడు ఓ రొమాంటిక్ పాత్రలో అలరించడానికి సన్నద్ధం అవుతుంది. ఏభై ఏళ్లకు దగ్గరలో ఉన్న ఈ హోమ్లీ బ్యూటీ రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ తమిళ సినిమాలో ఆమెకు ఈ అవకాశం దక్కింది. పైగా, శోభన ఈ సినిమాలో హీరో అధర్వ తో డ్యూయెట్లు పాడనుంది. వీళ్లద్దరూ జత కట్టి, ఓ మాస్ సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ తో రెచ్చిపోతారట.

అధర్వ హీరోగా ఓ సినిమా రానుంది. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించారు. అప్పటి నుండి ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ లో చాలామంది పేర్లు అనుకున్నారు. ఓ దశలో రంభ కూడా నటిస్తోందని వార్తలు వచ్చాయి. ఎలాంటి బోల్డ్ సీన్స్ కైనా తానూ రెడీ. కానీ అంటూ భారీ రెమ్యునరేషన్ ను చెప్పింది రంభ. ఎలాగూ ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా మరో బ్యూటీ ఉంటుంది. సో.. రంభ కంటే కూడా కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న ముదురు భామ అయితే బాగుంటుంది అనుకోని శోభనను అప్రోచ్ అయ్యారు.

ఆశ్చర్యంగా శోభన ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడం నిజంగా షాకింగే. నిజానికి శోభన తల్లి పాత్రలకు షిఫ్ట్ అయి, ఆర్టిస్ట్ గా మళ్ళీ బిజీ అవ్వాలనుకుంటున్న టైంలో అధర్వ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడం అంటే, శోభన కెరీర్ కి అది పెద్ద ప్లస్ పాయింటే. ఎలాగూ గతంలో కొన్ని బోల్డ్ పాత్రల్లో నటించి మెప్పించింది. కాకపోతే శోభన లో మునపటి బిగువు లేదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ టైంలో ఆమె గ్లామర్ రోల్ చేస్తే.. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Also Read:ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల

- Advertisement -